దేవరకద్ర: ప్రజలకు మంచి జరగాలి: మాజీ ఎమ్మెల్యే

55చూసినవారు
దేవరకద్ర: ప్రజలకు మంచి జరగాలి: మాజీ ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల మండలం కాటవరం తండాలో సోమవారం నిర్వహించిన శ్రీసీతారాముల ఆలయ శివలింగం, ఆంజనేయ స్వామి విగ్రహం, నవగ్రహల ప్రతిష్ఠాపనోత్సవంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్