చిన్న చింతకుంట మండలం శ్రీ కురుమూర్తి దేవస్థానం వద్ద ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణంకు బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృద్ధులు, వికలాంగులు, భక్తుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఘాట్ రోడ్ నిర్మాణానికి రూ. 110 కోట్ల నిధులు మంజూరు చేయడంతో, నేడు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు,