కౌకుంట్ల మండల కేంద్రంలో బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10: 00 గంటలకు రూ. 40 లక్షల సీజీఎఫ్ నిధులతో చేపట్టనున్న శివాలయం పునర్నిర్మాణం భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10: 30 గంటలకు పలు గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిర్వహిస్తున్న భూమి పూజలో పాల్గొని, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొంటారు.