దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సంక్రాంతి సందర్భంగా సంపత్ కుమార్, ప్రేమ్ కుమార్ స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. క్రీడలలో గెలుపు, ఓటములు సమానంగా తీసుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.