మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మూడ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి శనివారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, మహాబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.