మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం కందూరు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఎంపీ డీకే అరుణ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేయగా, ఆలయ కమిటీ సభ్యులు అరుణను శాలువాతో సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఇన్ ఛార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.