దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పట్టణానికి చెందిన మండ్ల పవన్ కుమార్ నాయుడు గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటి జిల్లాకు పేరు తెచ్చాడని మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ అన్నారు. గ్రూప్-1 ప్రతిభను కనబరిచినందుకు బుధవారం పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లి పవన్ కుమార్ తోపాటు తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ ఛైర్మన్ చెన్నకేశవరెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.