మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో గురువారంరాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి కొత్తగా నిర్మించిన అండర్ రైల్వే బ్రిడ్జి నీటమునిగింది. దీంతో దేవరకద్ర డోకూరు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. బ్రిడ్జ్
కింద నిలిచినా వర్షపు నీటిని గత్యంతరం లేక జేసీబీ, బకెట్లతో నింపుకొని గ్రామస్తులు వర్షపు నీటిని బయటకు ఎత్తిపోశారు. రైల్వే అండర్ బ్రిడ్జిలో నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.