దేవరకద్రలో భారీ వర్షం.. తడిసిన ముద్దైన ధాన్యం

81చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా దేవరకద్ర మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. వరి కోతలు పూర్తయి ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ. వేలు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు తడిసిన ధాన్యం ఎలా అమ్మాలని వాపోయారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :