బైక్ ను లారీ ఢీకొన్నా ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. వివరాల ప్రకారం. బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా అతి వేగంగా వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ప్రమాదం సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.