మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ జయంతి వేడుక సందర్భంగా ఆదివారం అంబేడ్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ పార్టీ ఆదేశానుసారం దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. మండల గ్రామస్థాయిలో అంబేడ్కర్ విగ్రహాలను శుద్ధిచేసి, జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలు సూచించారు.