తాము చేపట్టే పనుల్ని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ కారులో వస్తారని అనుకున్న అధికారులకు కాలినడకన వెళ్లి మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. రూలర్ మండల పరిధిలోని తుమ్మలకుంట వంటి గుడిసే తండా, చిన్నగుట్ట తండా, తుమ్మలకుంట, వల్లూర్ గ్రామాలలో చేపడుతున్న పునరావాస పనుల్ని కలెక్టర్ విజయేంద్ర బోయి ఎండను సైతం లెక్కచేయకుండా మూడు గంటలపాటు కాలినడకన వెళ్లి పరిశీలించారు.