మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డిగ్రీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన పరీక్ష కేంద్రాలయిన ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్విడిసి, వాసవి తదితర కళాశాలల వద్ద పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.