డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక వ్యక్తికి జైలు శిక్షను మహబూబ్ నగర్ జిల్లా కోర్టు విధించింది. శుక్రవారం ఎస్ఐ విక్రమ్ వివరాలు. నవాబ్ పేటకు చెందిన రామచంద్రయ్య మద్యం తాగి వాహనం నడుపుతుండగా పోలీసులకు పట్టుపడ్డాడు. అనంతరం మహబూబ్ నగర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు కోర్టులో హాజరు పరిచారు. రామచంద్రయ్యకు 3 రోజుల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించారని ఎస్ఐ తెలిపారు.