
ప్రభాస్ పెద్ద మనసు.. నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు సాయం
కామెడీ విలన్ ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కిడ్నీల ఫెయిల్యూర్‌తో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు. కిడ్నీ మార్పుకి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే, వారికి సాయం చేసేందుకు డార్లింగ్ ప్రభాస్ ముందుకు వచ్చారు. ప్రభాస్ అసిస్టెంట్ నుంచి ఫోన్ వచ్చిందని, ఆపరేషన్‌కు రెడీ అవ్వమని, డోనర్‌ను రెడీ చేసుకోమని తెలిపినట్టు ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి వెల్లడించింది.