హోలీ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో రంగుల కొనుగోలు ఊపొందుకొని గురువారం పండగ వాతావరణం నెలకొంది. పట్టణంలోని ప్రధాన మార్కెట్లు చౌరస్తాలలో వెలసిన రంగుల దుకాణాలు రంగులు జల్లే రాకెట్ల కొనుగోలుకు రంగులు కొనుక్కుంటూ దుకాణాల వద్ద ప్రజలు ఉత్సాహంగా కనిపించారు. కాగా రంగుల ధరలు రూ. 10 మొదలుకొని రూ. 1000 వరకు ఉన్నాయి. ఇక రాకెట్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనుగోలు కేంద్రాలలో పిల్లలు, పెద్దలు సందడి నెలకొంది.