మహబూబ్ నగర్: మహిళ చదివితే ఇంటి మొత్తం భవిష్యత్తు మారుతుంది

మహబూబ్ నగర్ జిల్లా పద్మావతి కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డితో కలిసి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు చదువు ఎంత ముఖ్యమో వారికి వివరించి, వారిని సగౌరవంగా బతికేలా చేశారన్నారు. ఒక్క మహిళ చదివితే ఇంటి మొత్తం భవిష్యత్తు మారుతుంది అన్న మహాత్మ ఫూలే ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు.