మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ గ్రామానికి సమీపాన వెలసిన పేదల తిరుపతిగా కొలిచే శ్రీ కురుమూర్తి స్వామి గిరి ప్రదక్షిణ శనివారం జరగనుంది. స్వామివారి గిరి ప్రదక్షిణకు ఉమ్మడి పాలమూరు జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.