మహబూబ్ నగర్: మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

61చూసినవారు
మహబూబ్ నగర్: మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ. భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులలో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్