మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా సెంటర్ లో కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషన్, మగ్గం ట్రేడ్లలో ఉచిత నైపుణ్య శిక్షణ పొందిన రెండవ బ్యాచ్ అభ్యర్థులకు సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పరీక్షలను నిర్వహించనున్నారు. మంగళవారం శిక్షణా కేంద్రంలో పరీక్ష సెంటర్ ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.