
అనారోగ్యంతో దర్శకుడు ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూత
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈస్ట్ కోస్ట్ రోడ్, ఏప్రిల్ మంత్, పుదుకొట్టయిరుందు శరవణన్ వంటి చిత్రాలకు స్టాన్లీ దర్శకత్వం వహించారు. స్టాన్లీ పలు సినిమాల్లో నటించారు. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ సినిమాలో ఆయన చివరిసారిగా కనిపించారు. స్టాన్లీ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.