మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం కేజీబీవీలోని విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల వివరాలు. పాఠశాలలో ఓ భవనం నిర్మాణంలో ఉంది. ఈనెల 14న కార్మికులు పనిచేస్తుండగా వారి ఫోన్లకు పాఠశాలలో ఛార్జింగ్ పెట్టారు. ఒక ఫోన్ కి కాల్ రాగా విద్యార్థిని లిఫ్ట్ చేసింది. ఆ విషయమై ఉపాధ్యాయురాలు విద్యార్థిని మందలించింది. మనస్తాపానికి గురైన విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.