వాల్మీకుల గళాన్ని పార్లమెంటులో ప్రస్తావించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలంగాణ వాల్మీకి సంఘం పాలమూరు జిల్లా కార్యదర్శి సతీష్ కుమార్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఇలాంటి కులవృత్తి లేని వాల్మీకి బోయలు విద్య, ఉపాధి రాజకీయ రంగాలలో వెనుకబడ్డారని సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.