విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించడమే లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ శిక్షణ కేంద్రాన్ని
ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి పాల్గొన్నారు.