దేవరకద్ర నియోజకవర్గం రామన్ పాడు జలాశయానికి శుక్రవారం వరద ఉద్ధృతి కొనసాగింది. సరళాసాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల నుంచి వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమై 2 గేట్లను ఎత్తి 10 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా 809 క్యూసెక్కుల వరద వస్తుండగా, సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిపి వేశారు. ఎన్టీఆర్ కాల్వకు 800 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.