పాలమూరు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడటంలో దిట్టా అని.. చేయని పనిని చేసినట్లుగా చెప్పుకోవడంలో కాంగ్రెస్‌కు సాటి ఎవరు లేరని భారాస జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డా. లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. రైతు పండుగ ఎందుకు చేస్తున్నారో, రైతులకు ఏం మేలు చేశారని సంబురాలు జరుపుకుంటున్నారో అర్థంకావడం లేదన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని భారాస ఆధ్వర్యంలో దీక్షా-దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.