దక్షిణ మధ్య రైల్వే ఉన్నత అధికారులతో బుధవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ ఇన్‌చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సానుకూలంగా స్పందించిన రైల్వే అధికారులు దేవరకద్రలోని 73 రైల్వే గేట్ ను రైల్వే అండర్ బ్రిడ్జ్ మంజూరు చేసి నిధులు కేటాయించారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. కౌకుంట్లలోని 81, 82 గేట్లను త్వరలోనే ఉన్నత అధికారులతో చర్చించి వాటిని కూడా మంజూరు చేస్తామని అన్నారు.