దేవరకద్రలో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్

74చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ దేవ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవరకద్ర పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వక్త శివశంకర్ మాట్లాడుతూ. భరత జాతిని జాగృతం చేస్తూ ప్రతిఒక్కరూ హిందూ మత సంస్కృతి సంప్రదాయాలను అనుసరించాలని సూచించారు. పరమత ప్రచారాలు నమ్మకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్