దేవరకద్ర నియోజకవర్గంను పారిశ్రామిక కారిడార్ గా గుర్తించాలి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన సందర్భంగా శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గంలో 44, 167 జాతీయ రహదారులు ఉన్నాయని, 44జాతీయ రహదారి 68కిమీ మేర విస్తరించి ఉందని, ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్ గా గుర్తించాలని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డ్రైపోర్ట్ ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కోరారు. మంత్రి అవకాశాలను పరిశీలించి, నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.