మదనపురం: బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ప్రొసీడింగ్ అందజేత
దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన కావలి చెన్నన్న ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రొసీడింగ్స్ కాపీ ను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.