రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని రైతులకు ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ రైతు భరోసా నిధులు ఎగ్గొట్టడంపై నిరసనగా బీఆర్ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగట్టాలని శ్రేణులకు కేటీఆర్ సూచనలు చేశారు.