మహబూబ్ నగర్: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలపై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ విజయేందిర బోయి అధ్యక్షతన శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా, వైభవోపేతంగా జరిపేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు, ముఖ్యంగా అలంకారం, ఉద్దాల ఉత్సవం రోజు ప్రజలు లక్షలాదిగా తరలి వస్తారన్నారు.