
టెక్సాస్‌లో 23 మంది బాలికలు గల్లంతు
అమెరికా టెక్సాస్ని భారీ వరదలు ముంచ్చెత్తాయి. నెల రోజులు కురువాల్సిన వర్షాలు.. కొన్ని గంటల్లోనే పడటం ఇందుకు కారణం. వర్షాలు, వరదల కారణంగా 13 మంది చనిపోయారు. అనేక మంది గల్లంతయ్యారు. వీరిలో 23మంది బాలికలు కూడా ఉన్నారు. టెక్సాస్ హిల్ కంట్రీలోని క్యాంప్ మిస్టిక్ వేసవి శిబిరానికి హాజరైన 750 మందిలో 23 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు బృందాలు రంగంలోకి దిగాయి.