తన సంకల్పంతో పేదరికం జయించిన యువకుడు ఒకేసారి నాలుగు ప్రభుత్వ కొలువులకు సాధించాడు. గద్వాల జిల్లా గుంటూరు గ్రామ యువకుడు వీరేష్ హైదరాబాద్ లో ఉంటూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఏడాదిలోనే నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు గురుకుల, ఎస్ఏ, ఎస్జిటి, గ్రూప్ 4 సాధించి శభాష్ అనిపించుకున్నాడు. కుటుంబ కష్టాలను చదువుతూ మార్చగలరు అని వీరేష్ నిరూపించాడు.