జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి లడ్డూ అపవిత్రం అయిన విషయం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, ఈ ఘటనలో సంబంధిత వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజులుగా మీడియా వేదికగా తిరుపతి లడ్డూ అపవిత్రం చేయబడిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయన్నారు.