అలంపూర్: జలమయమైన బాలుర పాఠశాల

61చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజలో గురువారం కురిసిన వర్షానికి బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణం జలమయమైంది. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తరగతి గదుల్లోకి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వర్షపు నీరుతో బయటకు వెళ్లేందుకు వీలు లేని పరిస్థితి నెలకొంది. వర్షం వచ్చిన ప్రతిసారి విద్యార్థులకు ఇబ్బంది తప్పడం లేదు. అధికారులు స్పందించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్