అలంపూర్: ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

54చూసినవారు
అలంపూర్ నియోజకవర్గం అయిజలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య అన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. విద్యను వ్యాపారం చేసి ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, పాఠశాలల్లో కనీస వసతులు లేవని, ఇరుకు గదుల్లో, వాహనాల చప్పుడు మధ్య పాఠశాలల నిర్వహిస్తున్నారని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్