అలంపూర్: అంటువ్యాధులపై అవగాహన

69చూసినవారు
అలంపూర్: అంటువ్యాధులపై అవగాహన
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఐయిజ పట్టణ పరిధిలోని మడ్డిగుంత వీధి 19 వార్డులో గురువారం ఏఎన్ఎం ప్రమీల ఆధ్వర్యంలో జాతీయ వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్ సి. డి. ) పురస్కరించుకుని కాలనీవాసులకు షుగర్, బీపీ, తదితర పరీక్షలు నిర్వహించారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో దోమల నివారణ, డయేరియా అంటువ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు లక్ష్మీదేవి, సుజాత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్