రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు తోడ్పాటు అందిస్తాయని గద్వాల జిల్లా కోపరేటివ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని శనివారం అలంపూర్ నియోజకవర్గం అయిజ సింగల్ విండో ఛైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి చిన్నతాండ్ర పాడు సహకార సంఘం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు తక్కువ వడ్డీకి పంట, దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నామని అన్నారు.