జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు ఆదివారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నయి. ఈ సందర్భంగా భక్తులు బాల బ్రహ్మేశ్వర స్వామివారికి అభిషేకాలు, జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ ఆలయ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.