జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో విద్యుత్ అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం ఏర్పడింది. జూన్ మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు 10, 20 సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పటంలేదని వాపోయారు. వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.