అలంపూర్: వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

54చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి వద్ద బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. రైతులు పండించే వడ్లు మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతులకు కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్