జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం గోకులపాడు ప్రాథమిక పాఠశాలలో గురువారం మొదటి రోజు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాకపోవడంతో ఆ పాఠశాల నిర్మానుష్యంగా కనిపించింది. ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా అందులో ఒక ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదు. మొదటి రోజు కావడంతో విద్యార్థులు రాలేదని పాఠశాల హెడ్మాస్టర్ చెప్పుకొచ్చారు. దీంతో ఎలాంటి ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించలేదని అన్నారు.