అలంపూర్ నియోజకవర్గం ఇటీక్యాల మండలం చాగాపురంలో పండిన పొగాకును జిపిఏ కంపెనీ అగ్రిమెంట్ ధర రూ. 18, 500 ప్రకారం కొనుగోలు చేయాలని బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. కంపెనీ మాట తప్పి రూ. 10 వేలకు కొనుగోలు చేస్తామని అనడం సరైంది కాదన్నారు. రైతులు ఎకరాకు రూ. 50 వేలు ఖర్చుపెట్టి పంట పండిస్తే తీరా కొనుగోలు సమయంలో కొర్రీలు పెట్టడం దారుణమని రైతులకై పోరాడుతామన్నారు.