అలంపూర్: జోగులాంబను దర్శించుకున్న వైస్ ఛాన్స్ లర్

66చూసినవారు
అలంపూర్: జోగులాంబను దర్శించుకున్న వైస్ ఛాన్స్ లర్
హైదరాబాద్ లోని కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ సూర్యధనుంజయ్ మంగళవారం అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి, శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని సూర్య ధనుంజయ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్