జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలలో శనివారం రాత్రి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ సమీపంలోని తుంగభద్ర నదిలో హంస వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.