బొలెరో వాహనం బోల్తా

2269చూసినవారు
బొలెరో వాహనం బోల్తా
జోగులాంబ గద్వాల జిల్లా & మండలం పుటాన్ పల్లి స్టేజీ సమీపంలో శుక్రవారం ఓ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. పట్టణంలోని వివిధ హోటలలో మిగిలి ఉన్న ఆహారాన్ని వరాహల కోసం సేకరించి బొలెరో వాహనం ద్వారా ఎర్రవల్లికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న గద్వాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో వాహనాన్ని పక్కకు జరిపారు.

సంబంధిత పోస్ట్