జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈ నెల 29న తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరగనున్న దీక్ష దివస్ సభ ఏర్పాట్లను మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్‌తో కలిసి జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు పరిశీలించారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.