జోగులాంబ గద్వాల జిల్లా జూరాల వాటర్ గ్రేడ్ పరిధిలోని గ్రామాలకు శనివారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ రవి చంద్రకుమార్ రెడ్డి తెలిపారు. జూరాల వద్ద ఉన్న నీటిశుద్ధి కర్మాగారంలో ట్యాంకులు, వాటర్ ఫిల్టర్లు శుభ్రం చేస్తున్నందున నీటి సరఫరా నిలిపివేశామన్నారు. 30వ తేదీన యథావిధిగా నీటి సరఫరా ఉంటుందని బి ఏడిఈఈ పేర్కొన్నారు.