ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆంజనేయులు గౌడ్, బాసు హనుమంతు నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వరంగల్ సభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.